తెలంగాణ ప్రభుత్వం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), ఖమ్మం చైర్మన్‌గా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత పదేళ్లుగా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.