ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై రాకేష్ రెడ్డి మండిపాటు

6చూసినవారు
ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై రాకేష్ రెడ్డి మండిపాటు
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సగం కాలం గడిచినా రాష్ట్రంలో ఎలాంటి ప్రగతి లేదని, కేవలం రాజకీయ కక్షసాధింపులు, బూతు పురాణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్ర షురూ చేస్తే కాంగ్రెస్ పని ఖాళీ అవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్