ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య మృతి దేశానికి తీరని లోటని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో ఆయన మృతదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మొక్కలు నాటడానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన వెంట పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్ ఉన్నారు.