ఖమ్మం: నూతన డీపీఓగా రాంబాబు బాధ్యతలు

3చూసినవారు
ఖమ్మం: నూతన డీపీఓగా రాంబాబు బాధ్యతలు
ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారిగా (డీపీవో) టీ. రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీపీఓగా పనిచేసిన ఆశాలత పదవీ విరమణ పొందడంతో రాంబాబు ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి, పరిపాలన మెరుగుదలకు సహకారం అందిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. రాంబాబు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్