ఖమ్మం: మంత్రి తుమ్మలను కలిసిన రాయల

64చూసినవారు
ఖమ్మం: మంత్రి తుమ్మలను కలిసిన రాయల
హైదరాబాద్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి కావడంతో తుమ్మల ఆయనను శాలువాతో సన్మానించారు. ఇచ్చిన పదవికి రాయల న్యాయం చేస్తున్నారని మంత్రి తెలిపారు. గిడ్డంగుల సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న రాయలను ఈసందర్భంగా అభినందించారు. నాయకులు సాధు రమేష్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్