ఖమ్మంలో గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన జరిగిన సమీక్షలో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆంగ్ల పఠనా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ (ఈసీఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు ఈసీఆర్ కోసం కేటాయించి, విద్యార్థులకు ఆంగ్లం చదవడంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.