రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1, 654 మంది అతిథి అధ్యాపకులను కొనసాగించచడంతో పాటు పెండింగ్ వేతనాలు ఇప్పించేలా కృషి చేయాలని అతిథి అధ్యాపకురాలు సాదిన్ని రజిని తదితరులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి వినతిపత్రం అందజేశారు. గురువారం రఘునాథపాలెంకు వచ్చిన ఆయనకు పలువురు కలిసి సమస్యను వివరించారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు.