ఖమ్మం నగరంలోని చర్చి కంపౌండ్- ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై విరిగిన జాయింట్ రబ్బర్ స్టిక్స్ లకు వెంటనే మరమ్మత్తులు చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆర్అండ్ బీ అధికారులకు వినతిపత్రం అందజేస్తూ, ఈ బ్రిడ్జిపై వాహనదారులు భయాందోళన చెందుతున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.