ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉమ్మడి జిల్లా అధికారి (ఆర్ఎల్సీ) అరుణ కుమారికి వినతిపత్రం అందజేశారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో, వెనుకబడిన విద్యార్థులకు నిత్యం మార్గదర్శకత్వం అందించాలని వారు కోరారు. జార్జిరెడ్డి PDSU, AISA-PDSU నాయకులు మందా సురేష్, మస్తాన్ ఈ డిమాండ్ చేశారు.