ఖమ్మం: గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

54చూసినవారు
ఖమ్మం: గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి
జిల్లాలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో గీత కార్మికుల సమస్యలపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. గీత కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఎక్స్ గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్