ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు బాబురావు పెట్రోల్ బంక్ వెనుక ఓ కార్పొరేటర్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేశారు. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఈ బిల్డింగ్ నిర్మాణం చేశారని వచ్చిన వార్తలపై విచారణ జరిపించి, అక్రమ నిర్మాణం అని తేలితే బిల్డింగ్ ను కూల్చాలని కోరారు.