ఖమ్మం: పెండింగ్ సమస్యలు పరిష్కరించండి

ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ దివాకర టీ. ఎస్. రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, భూభారతి, సాదాబైనామా, ప్రభుత్వ భూములు, పెండింగ్ సర్వేలు, ఇసుక, ఎస్ఐర్ తదితర అంశాలపై సమీక్షించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో మార్గదర్శకాలను పాటిస్తూ పరిష్కరించాలని, భూభారతి పెండింగ్ స్లాట్లను పరిశీలించి ప్రతిరోజు మూడు మండలాల ఫైళ్లను జిల్లాస్థాయికి పంపించాలని ఆదేశించారు.
