ఖమ్మం కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సీపీ సునీల్ దత్ శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖకు ఎనలేని సేవలందించిన అధికారులను ఆయన కొనియాడారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను కూడా ఈ సందర్భంగా అభినందించారు.