ఖమ్మం: రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ

3చూసినవారు
ఖమ్మం: రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
శనివారం తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఫార్చునర్, నెక్సన్ కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి తల్లాడ వస్తున్న ఫార్చునర్ కారు, తల్లాడ నుంచి ఖమ్మం వెళ్తున్న నెక్సన్ కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నెక్సన్ కారు డ్రైవర్‌కు తలకి గాయాలవడంతో అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్