ఖమ్మం: రోడ్డు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలి

81చూసినవారు
ఖమ్మం: రోడ్డు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలి
గ్రామాల్లో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శనివారం రఘునాథపాలెం మండలం కె. వి. బంజరలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. మనం చేసే పని పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు. పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షిస్తూ నాణ్యత తగ్గకుండా చూడాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్