తుపాన్, వరదలతో పంటలు నష్టపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేల పరిహారం వారిని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మం నగరంలో మున్నేటి పరీవాహకంలో వరద ముంపు బాధితులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్న ఆయన, ఈ పరిహారం రైతు నష్టానికి కాదని, ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడానికేనని విమర్శించారు.