ఖమ్మం: నిరంతర విద్యుత్ సరఫరాకు రూ. 15. 90 కోట్లు

3చూసినవారు
ఖమ్మం: నిరంతర విద్యుత్ సరఫరాకు రూ. 15. 90 కోట్లు
ఖమ్మం జిల్లాలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు రూ. 130 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపిన వివరాల ప్రకారం, 33/11 కెవి సబ్ స్టేషన్లలో 16 పవర్ ట్రాన్స్ ఫార్మర్లను రూ. 20 కోట్లతో, 12 అదనపు ట్రాన్స్ ఫార్మర్లను రూ. 110 కోట్లతో ఏర్పాటు చేశారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం రూ. 15. 90 కోట్ల వ్యయంతో 36 ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణం చేపట్టారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా జిల్లాలోని 2, 718 ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించారు.

సంబంధిత పోస్ట్