ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, ఈ ఐదేళ్ల పాలనలో ఖమ్మం నగరం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందని, మంత్రులు, ప్రభుత్వాల సహకారంతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. బుధవారం కేఎంసీ కార్యాలయంలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. కేఎంసీ, పబ్లిక్ హెల్త్, గ్రాంట్స్, ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నగరంలో రూ. 4 వేల కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని మేయర్ పేర్కొన్నారు.