ఖమ్మం జిల్లాలో 52,059 మహిళా సంఘాలకు రూ. 57.15 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసా కింద 3,43,997 మంది రైతులకు రూ. 270.93 కోట్లు జమ చేశారు. యాసంగిలో 18,774 మంది రైతుల నుంచి 1,42,273 మెట్రిక్ టన్నుల ధాన్యం, 40,370 మంది రైతుల నుంచి 2,80,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.