రైతులు రూ. 80-రూ. 90తో కొనుగోలు చేసే గన్నీ బ్యాగ్లకు వ్యాపారులు రూ. 20 మాత్రమే చెల్లిస్తుండడంతో నష్టం జరుగుతోందని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొలేటి నాగేశ్వరరావు అన్నారు. ఈమేరకు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిని కలిసి గన్నీ బ్యాగ్లకు ఇచ్చే నగదు రూ. 60కు పెంచాలని వినతిపత్రం అందజేశారు. ఆరు నెలల క్రితం అధికారులు వ్యాపారులతో సమావేశం నిర్వహించి రూ. 50 నుంచి రూ. 60 ఇప్పిస్తామని చెప్పినా అమలు కావడం లేదని తెలిపారు.