మోంథా తుపాన్ ప్రభావంతో ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు ఆర్టీసీ డిపోల నుంచి 127 బస్సు సర్వీసులను నిలిపివేయడంతో సంస్థ రూ. 29,73,145 ఆదాయాన్ని కోల్పోయింది. సత్తుపల్లి డిపో రూ. 7,86,718, కొత్తగూడెం డిపో రూ. 6,13,620, ఖమ్మం డిపో రూ. 5,03,447 నష్టాన్ని చవిచూశాయి. భద్రాచలం, మధిర, ఇల్లందు, మణుగూరు డిపోలు కూడా గణనీయమైన ఆదాయాన్ని కోల్పోయాయి.