ఖమ్మం రూరల్ మండలం కస్నాతండాలో బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పల్లెగూడెం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకొని, రూ. కోటి పరిహారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.