ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు జాతర జరగనుంది. లక్షల్లో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆయన, గతంలో కంటే మెరుగైన వసతులు కల్పించాలని, అవసరమైన మేర పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు.