ఖమ్మం రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

1592చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన బట్టల వ్యాపారి కూరపాటి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు బైక్ పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న గ్రానైట్ లారీ ఢీకొట్టింది. లారీ చక్రాల కిందపడిపోయి తల నుజ్జునుజ్జు అయి మృతిచెందాడని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్