ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. మోతీనగర్, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, వెంకటేశ్వరనగర్, సమ్మక్క సారక్క గద్దెల రోడ్డు, ధంసలాపురం వంటి ప్రాంతాల్లో రోడ్లపై పేరుకుపోయిన బురదను మిషనరీలు, కార్మికుల సహాయంతో తొలగించారు. ట్యాంకర్ల ద్వారా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు. తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.