ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న ఉదయం 8 గంటలకు లకారం ట్యాంక్ బండ్ వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య శనివారం తెలిపారు. పోటీలో పాల్గొనే మహిళలు 12వ తేదీ సాయంత్రం 8 గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి బహుమతి రూ. 25వేలు, రెండోవ బహుమతి రూ. 15వేలు, మూడో బహుమతి రూ. 10వేలు ఉంటుందన్నారు. వివరాలకు 8328680773, 9063343338 కు సంప్రదించాలన్నారు.