ఖమ్మం జిల్లాలో వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు వేసే దశలో ఉన్న రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక వీడియోను రూపొందించారు. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్యాకెట్లపై గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు.