జనవరి 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా, పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.