ఖమ్మం జనరల్ ఆస్పత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి కల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 9 లక్షల విలువైన రేడియేటర్ వార్మర్లు, ఫొటో థెరపీ, ఇతర వైద్య పరికరాలను అందించారు. ఈ పరికరాలను కలెక్టర్ దివాకర ప్రారంభించి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా దాతలు ముందుకు రావడం అభినందనీయమని, పేదలకు ఉపయోగపడేలా వైద్య పరికరాలు అందించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, కల్లా ఫౌండేషన్ చైర్మన్ పాపారావు పాల్గొన్నారు.