ఖమ్మం జిల్లాకు చెందిన కంభంపాటి శారద మంగళవారం సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట్ర ఇన్చార్జ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. గురుకులాల చరిత్రలో ఖమ్మం జిల్లాకు ఈ స్థాయి పదవి తొలిసారిగా దక్కడం విశేషం. ఉపాధ్యాయురాలిగా ప్రారంభమైన ఆమె సేవా ప్రస్థానం టీజీటీ, పీజీటీ, జెడీఎల్ ప్రిన్సిపల్ గా కొనసాగింది. అనంతరం డిప్యూటీ, ఆర్జేసీ, జాయింట్ సెక్రటరీగా సేవలందించారు.