ఖమ్మం: శివాలయ భూమి వివాదం.. అధికారులు విచారణ

13చూసినవారు
ఖమ్మం: శివాలయ భూమి వివాదం.. అధికారులు విచారణ
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలంలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి (శివాలయం) గుడి స్థలంపై శనివారం దేవాదాయ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవస్థానానికి రికార్డుల్లో 3.08 ఎకరాల స్థలం ఉండగా, ప్రస్తుతం 10 గుంటలలో మాత్రమే ఆలయం ఉందని, మిగిలిన స్థలంపై అధికారులు పరిశీలించారు. సర్వే నంబర్ 362లోని 11.33 ఎకరాలలో దేవాలయానికి చెందిన 3.08 ఎకరాల స్థలానికి కొలతలు వేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ శాఖను కోరారు. శివాలయం భూమి హద్దులు గుర్తించే వరకు 362 సర్వే నంబర్ లోని 11.33 ఎకరాల భూమిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని గ్రామ పంచాయతీ అధికారులను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్