ఖమ్మంను స్వచ్ఛ నగరంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 54వ డివిజన్ ఇల్లెందు క్రాస్ రోడ్డు విద్యుత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసుకున్న పండ్ల దుకాణదారులు వ్యర్థాలను రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో గురువారం అధికారులు తనిఖీలు చేపట్టి దుకాణదారులకు రూ. వెయ్యి జరిమానా విధించారు. మరోమారు రోడ్డుపై వ్యర్థాలు, చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.