ఖమ్మం: ప్రత్యామ్నాయ మార్గం చూపించండి

52చూసినవారు
ఖమ్మం రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు మరో ప్రాంతంలో ఉపాధి కల్పించేలా ప్రత్యామ్నాయం చూపించాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు సూచించారు. మంగళవారం చిరు వ్యాపారులతో కలిసి ఎంపీ కేఎంసీ కమిషనర్ ను కలిశారు. వ్యాపారుల సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకరాగా. వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించేందుకు అంగీకరించినట్లు ఎంపీ వివరించారు.