ఎండ తీవ్రత నేపథ్యాన ఖమ్మం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో శనివారం నుంచి ఒకటే పూట బడులు అమలుచేయాలని డీఈఓ ఈ. సోమశేఖరశర్మ సూచించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని, ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు. కాగా, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న పాఠశాలలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.