ఖమ్మం జిల్లాలో పర్యాటకుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న హరిత హోటల్ కోసం అనువైన ప్రదేశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్ఎస్పీ క్యాంప్ తో పాటు పలు ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.