ఖమ్మం: ఫర్టిలైజర్ యాప్ తో సజావుగా యూరియా పంపిణీ

1చూసినవారు
ఖమ్మం: ఫర్టిలైజర్ యాప్ తో సజావుగా యూరియా పంపిణీ
ఖమ్మం జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా సాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జనవరి 29 నుంచి నిన్నటి వరకు 25,252 మంది రైతులు యాప్ ద్వారా 1,08,721 యూరియా బస్తాలు బుక్ చేసుకోగా, 87,350 సంచులు కొనుగోలు చేశారు. రైతులు తమ పంట, విస్తీర్ణం ఆధారంగా జిల్లాలోని ఏ డీలర్ లేదా సొసైటీల్లోనైనా యూరియాను బుక్ చేసుకోవచ్చని, దీనివల్ల క్యూ లైన్లు లేకుండా సమయం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు.