ఖమ్మం: కేఎంసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ

61చూసినవారు
ఖమ్మం: కేఎంసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం సంఘీభావ ర్యాలీ చేపట్టారు. కేఎంసీ కార్యాలయం నుంచి ఆర్టీవో ఆఫీస్ మీదుగా బైపాస్ రోడ్డు వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. సరిహద్దు వెంబడి పాకిస్థాన్, భారత్ పౌరులపై చేస్తోన్న దాడులను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదులను మట్టుబెడుతూ యుద్ధంలో భారత దళాలు చూపిస్తోన్న తెగువ, పోరాట పటిమను కొనియాడారు.

సంబంధిత పోస్ట్