పెండింగ్లో ఉన్న భూసమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుందని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 70 గ్రామాల్లో ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించేలా సర్వేయర్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. మొత్తం 300మంది సర్వేయర్ల అవసరం ఉండగా, 280మంది అంగీకారం తెలిపినందున త్వరలోనే సర్వే మొదలవుతుందని వెల్లడించారు. ఈ సర్వే ద్వారా భూముల వివాదాలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు.