వైరా మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ లో పనిచేస్తున్న కార్మికులను జీవో నెంబర్ 14లో చేర్చి, వారికి సమాన వేతనం అందించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. గత పదేళ్లుగా పనిచేస్తున్న ఈ కార్మికులు సరైన వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.