పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి జి. రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ లో సోమవారం జరిగిన పోలీసు, బ్యాంకర్లు, చిట్ ఫండ్ ప్రతినిధులు, అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రిమినల్, ఇతర కేసులు రాజీ చేసుకోవాలనుకునే వారికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందన్నారు. ప్రమాద కేసులను రాజీ చేసుకుంటే ఒకే సారి పరిహారం అందుతుందని తెలిపారు.