రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. బుధవారం ఖమ్మం జిల్లా
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని, ఈ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.