ఖమ్మం: మౌళిక వసతుల కల్పనకు చర్యలు

53చూసినవారు
ఖమ్మం: మౌళిక వసతుల కల్పనకు చర్యలు
రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్ల్‌లోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మత్తు పనులపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్