ఖమ్మం: రూ. 9. 67కోట్లకు స్టాక్ మార్కెట్ వ్యాపారి ఐపీ

3చూసినవారు
ఖమ్మం: రూ. 9. 67కోట్లకు స్టాక్ మార్కెట్ వ్యాపారి ఐపీ
ఖమ్మం రాఘవేంద్ర నగర్ కు చెందిన స్టాక్ మార్కెట్ వ్యాపారి మైలవరపు నాగసందీప్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కారణంగా నష్టపోయి, రూ. 9.67 కోట్లకు దివాళా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. స్నేహితుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసి, ప్రస్తుతం తీర్చలేని పరిస్థితి ఎదురైందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈమేరకు 31 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ, తన న్యాయవాది ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సోమవారం ఐపీ దాఖలు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్