ఖమ్మం నగరంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలు, గోదాములను డీఏఓ ధనసరి పుల్లయ్య, ఏడీఏ కొంగల వెంకటేశ్వరరావు, ఏఓ కిషోర్ బాబుతో కలిసి తనిఖీ చేశారు. వ్యాపారులు పాత ఎంఆర్పీతోనే ఎరువులను విక్రయించాలని, కొత్త ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఏఓ హెచ్చరించారు. విత్తన విక్రయాల్లో పారదర్శకత పాటించాలని సూచించారు.