ఖమ్మం జిల్లావ్యాప్తంగా అత్యధిక గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేలా పార్టీ శ్రేణులు పాటుపడాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటితో పాటు ఏఐసీసీ, పీసీసీ బాధ్యులకే కాక తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన నేతలకు ఆయన ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.