పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి జి. రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈమేరకు 5,536 చెక్ బౌన్స్ కేసులు, 3,651 క్రిమినల్ కాంపౌండ్ కేసులను పరిష్కరించేలా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.