ఖమ్మం: మహిళల నిరసనకు మద్దతు

9చూసినవారు
ఖమ్మం బొక్కలగడ్డలో కాల్వొడ్డున ఉన్న వైన్స్ షాపులను తొలగించాలని స్థానికులు, మహిళలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ నిరసనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సరికాదని, మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైన్స్ షాపులను తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్