వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన అరవింద్ (12) అనే బాలుడు, చిన్న గోపతి గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహానికి హాజరయ్యాడు. వేసవి కారణంగా సరదాగా ఈత కొట్టడానికి స్నేహితులతో కలిసి బావి వద్దకు వెళ్ళాడు. ఈత రాకపోయినా బావిలోకి దూకడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాలుడి మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.