ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో చేపట్టిన సింథటిక్ ట్రాక్ పనులను కచ్చితంగా రెండు రోజుల్లో పూర్తి చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సింథటిక్ ట్రాక్ పనుల నాణ్యతను తనిఖీ చేసి, మిగిలిన పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.