గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా సమాచారం అందించేందుకు ప్రభుత్వం టీ-పోల్ మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఖమ్మం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ స్లిప్పులు తెలుసుకోవచ్చు. ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు. అధికారులు ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని ఓటర్లకు సూచిస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.